వర్మ అంటే మోడీకి ఎందుకంత భయం ?

Friday, January 11th, 2019, 08:00:47 AM IST

అలోక్ వర్మ, మోడీల వ్యవహారం రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో అలోక్ వర్మను బలవంమఠపు సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం ఇంచార్జ్ డైరెక్ట్ర్ గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. తాను బలవంతపు సెలవుపై పంపడానికి సవాల్ చేస్తూ వరం సుప్రీం కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడ ప్రభుత్వం విధించిన బలవంతపు సెలవును కొట్టేసింది. దీంతో అలోక్ వర్మ మరోసారి సీబీఐ డైరెక్టర్ పదవిలోకి వచ్చారు. కానీ ఆయన పదివికి అందుకున్న48 ఘటనల్లోనే బదిలీ చేస్తూ మోడీ నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే హోంశాఖ ఆయన్ను అగ్నిమాపక శాఖ డీజీగా నియమించింది.

తిరిగి పదవిలోకి వచ్చిన వెంటనే వర్మ ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదన్న సుప్రీం ఆదేశాల్ని పక్కనబెట్టి కొందరు అధికారుల్ని బదిలీ చేసి పాత వారిని తెచ్చుకున్నారు. ఆయన బదిలీ చేసిన వారిలో మన్నెం నాగేశ్వరరావు కూడ ఉన్నారు. అలాగే రాఫెల్ కుంభకోణంపై కూడ ఆయన దర్యాప్తుకు ఆదేశిస్తారనే సమాచారం ఢిల్లీలో కలకలం సృష్టించింది. దీంతో మోడీ గురువారం సాయంత్రం ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వర్మను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు కమిటీలోని జస్టిస్ సిక్రీ సపోర్ట్ చేయగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. కానీ 2-1 మెజారిటీతో మోడీ వర్మను బదిలీ చేయగలిగారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ రాఫెల్ కుంభకోణాన్ని బయటికి తీస్తారనే భయంతోనే మోడీని వర్మను బదిలీ చేశారని ఆరోపిస్తున్నాయి.