డీజీపీల‌తో మోదీ ఏం మాట్లాడుతారు?

Saturday, November 26th, 2016, 10:32:02 AM IST

narendra-modi
ఈరోజు వేకువ‌ఝామునే హైద‌రాబాద్‌లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో యోగా, ధ్యానంతో ధైనందిన జీవితాన్ని ప్రారంభించిన మోదీ మ‌రి కాసేప‌ట్లో డీజీపీల‌తో సమావేశానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల డీజీపీలో ఇదే గ్రౌండ్స్‌కి అటెండ్ అయ్యి ఉన్నారు. అయితే ఈ స‌మావేశం వెన‌క అస‌లు ఉద్ధేశ‌మేంటి?

ఇన్నాళ్లు దేశ‌వ్యాప్తంగా ఉన్న పోలీసుల మ‌ధ్య స‌రైన స‌మ‌న్వ‌యం లేక అంత‌ర్ రాష్ట్ర తీవ్ర‌వాదం పెట్రేగింది. ఎక్క‌డో తీగ లాగితే దాని డొంక వేరొక చోట క‌దులుతోంది. అదొక్క‌టే కాదు … రాష్ట్రాల మ‌ధ్య పోలీసుల మ‌ధ్య ఉన్న క‌మ్యూనికేష‌న్ గ్యాప్ ని తొల‌గించ‌గ‌లిగితే తీవ్ర‌వాదాన్ని, దోపిడీని, దొంగ‌త‌నాల్ని నిలువ‌రించ‌గ‌ల‌మ‌ని మోదీ భావిస్తున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టికే పెద్ద నోట్ల ర‌ద్దుతో సామాన్యులు ఏ రీతిన స‌త‌మ‌త‌మ‌వుతున్నారు? క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌లు ఎలా ఉన్నాయి? ప్ర‌తిప‌క్షాల అరుపులు నిజ‌మేనా? అస‌లు వాస్త‌విక‌త ఎంత‌? అన్న‌ది కూడా పోలీస్ బాస్‌ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో ఏం చేస్తే బావుంటుందో స‌మీక్షించ‌నున్నారు. ఇంకా ప‌లు కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నారు.