వైరల్ వీడియో : రాజకీయ గురువును చూసి కూడా పలకరించని మోడీ!

Sunday, March 11th, 2018, 09:00:53 AM IST

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత జనతా పార్టీ గెలిచినా సంగతి తెలిసిందే. అందుకుగాను ఇటీవల అగర్తలాలోని అసోం రైఫిల్స్‌ మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ నూతన సీఎం గా ప్రమాణం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ పెద్దలందరూ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అయితే మోడీ వేదికపైకి వచ్చే సమయంలో ఎవరు ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది. తన రాజకీయ జీవితంలో మోడీకి ఎంతగానో సహాయపడిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని మోడీ పట్టించుకోలేదని సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెలువడుతున్నాయి. అందరికి నమస్కారం చేసుకుంటూ వస్తోన్న మోడీ సడన్ గా అద్వానీ ముందుకు వచ్చే సరికి చూసి చూడనట్టుగా ప్రవర్తించారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.