మోదీ పై మర్డర్ ప్లాన్.. రాజీవ్ గాంధీ తరహాలో?

Saturday, June 9th, 2018, 09:32:28 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మర్డర్ ప్లాన్ చేసినట్లు ప్రస్తుతం నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందుతున్నాయి. దీంతో భారత రక్షణ శాఖ దేశమంతటా హై అలెర్ట్ ప్రకటించింది. ఇటీవల జరిగిన ఓ అల్లర్లలోని వ్యక్తిని అరెస్ట్ చేయగా ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఈ టార్గెట్ పెట్టుకున్నాది ఉగ్రవాదులు కాదు. ఇక్కడి మావోయిస్టులే అని తేలింది. అదే విధంగా రాజీవ్ గాంధీ మర్డర్ తరహాలోనే మోడీని ని టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది.

భీమా–కోరెగావ్‌లో ఇటీవల జరిగిన అల్లర్లతో ‘ఈల్గర్‌ పరిషద్‌’కు చెందిన కొందరిని అరెస్ట్ చేయగా ఓ వ్యక్తి ద్వారా కుట్ర బయటకు వచ్చింది. అనుమానం ఉన్న 5 మందిని కోర్టులో హాజరుపర్చారు. అలాగే వారి నుంచి మూడు లేఖలు లుకూడా లభ్యమయ్యాయి. అందులో మోడీ మర్డర్ ప్లాన్ గురించి ఉండడం ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. మే 21, 1991లో తమిళనాడు – శ్రీపెరంబుదూర్‌ లో రాజీవ్ గాంధీ హత్య ఎలా అయితే జరిగిందో అదే తరహాలో ఒక మహిళా ఆత్మాహుతి దాడిలో ప్రధానిని టార్గెట్ గా పెట్టుకున్నారు. రాడ్ షోలో ఉండగా ప్రధానిపై ఎటాక్ చేయాలను అనుకున్నారు. అలాగే హత్య కోసం 8 కోట్లు ఖర్చు అవుతుందని ఎం–4 రైఫిల్, 4 లక్షల రౌండ్ల మందుగుండు సెట్ చేసుకోవాలనే విషయాలు లేఖలో లభ్యమయ్యాయి. ఇక కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రధానికి సెక్యూరిటీని మరింత కట్టు దిట్టం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments