మోడీ బంపర్ అఫర్.. సమాచారం ఇస్తే కోటి మీదే ?

Saturday, September 23rd, 2017, 12:20:20 PM IST

మోడీ ఆలోచనలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆశ్చర్యకరమైన నిర్ణయాలతో ఒక్కసారిగా షాక్ లు ఇస్తున్నారు. ఇక కొన్ని పథకాలను ప్రవేశపెట్టి ఏ మాత్రం తప్పుదారి పట్టకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా నల్ల ధనాన్ని పట్టించడంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయి. అయితే ఇప్పుడు మరో సరికొత్త ఆలోచనతో మోడీ ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అంతే కాకుండా ఒక డ్యూటీని కూడా ఇస్తాడట.

అందులో సక్సెస్ అయితే భారీ నజరానని ఇవ్వడానికి సన్నాహకాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్ల ధనాన్ని దాచేవారు అలాగే బినామీ లు ఇప్పుడు ఇంకా ఉన్నారని అధికారులు అనుమానపడుతున్నారు. అయితే మోడీ అందుకు ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించారట. త్వరలోనే ఆ పద్దతిని అమలు పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బినామీల వివరాలు తెలిస్తే వెంటనే ప్రభుత్వానికి తెలిసేలా ప్రజల్ని ఆయుధంగా వాడుకోవాలని ఆలోచిస్తుందట. సమాచారం అందించిన వారికి 15 లక్షల నుండి కోటి రూపాయలవరకు ప్రైజ్ మణిని ఇవ్వడానికి రెడీగా ఉందట. త్వరలోనే ఈ విధానం అమలు కానుందని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments