చంద్ర‌బాబుకు ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!!

Saturday, October 13th, 2018, 10:15:14 AM IST

ఏపీలో ఆప‌రేష‌న్ -ఎక్స్‌(ఆప‌రేష‌న్ గరుడ‌)ని మోదీ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా పూర్తి చేస్తోంది. అయితే నేరుగా చంద్ర‌బాబు ఆస్తుల‌పై విచార‌ణ జ‌రిపించే తెలివి త‌క్కువ ప‌ని చేయ‌కుండా, చంద్ర‌బాబు బినామీల చిట్టాను ప‌క్కాగా రెడీ చేసుకుని ఏ దొంగ ఏఏ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టారు? ఏఏ కాంట్రాక్టుల్లో ఎంతెంత దోచేశారు? ఎవ‌రికి విదేశాల్లో ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి? షేర్ మార్కెట్‌లో ఎవ‌రి వాటా ఎంతెంత‌? వ‌ంటి వివ‌రాల్ని ప‌క్కాగా సిద్ధం చేసుకుని, ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ వంటి వారు ఇచ్చిన స‌మాచారం క‌లెక్ట్ చేసుకుని తెలివిగా స‌రైన టైమింగుతో మోదీ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టారు. ఈ దాడుల్లో జ‌ల‌గ‌లు, తిమింగళాలు, సొర‌చేప‌లు… ఒక‌టొక‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప్ర‌జల సొమ్ముల్ని ర‌క‌ర‌కాల మార్గాల్లో దొడ్డిదారిన మ‌ళ్లించిన మ‌హానుభావుల చిట్టా మొత్తం మోదీ చెంత ఉండ‌డంతో స‌ద‌రు నాయ‌కులంతా బెంబేలెత్తుతున్నారన్న‌ది ప‌క్కా నిజం.

అయితే చంద్ర‌బాబు ఆస్తులు, అస్సెట్స్‌పై మోదీ ఎందుకు దాడి చేయ‌డు? అంటే ఒక ముఖ్య‌మంత్రి స్థాయి హోదా ఉన్న వ్య‌క్తిపై వెంట‌నే దాడి చేయ‌కూడ‌దు. పాము చావాలి… క‌ర్ర విర‌గ‌కూడ‌దు! అన్న చందంగా చంద్ర‌బాబు వ‌ర్గీయుల్ని నిర్వీర్యం చేయ‌డం ద్వారా, భ‌య‌పెట్ట‌డం ద్వారా తాను అనుకున్న‌ది సాధించుకోవ‌డం అనే ఎత్తుగ‌డ‌ను మోదీ అనుస‌రిస్తున్నారు. పొలిటిక‌ల్ క్రీడ‌లో ఇది పీక్స్ అనే చెప్పాలి. గ‌త కొన్ని రోజులుగా టీడీపీకి సంబంధించిన నాయ‌కుల‌పై ఐటీ దాడులు నిర్వ‌హిస్తున్న కేంద్రం చంద్ర‌బాబును ఎందుకు ట‌చ్ చేయ‌డం లేదు? ఆ సాహ‌సానికి ఎందుకు పూనుకోవ‌డం లేదు? అన్న ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. దీని వెన‌కున్న అంత‌రార్థం ఏమిటి?. చంద్ర‌బాబుకు సంబంధించిన ఆస్తుల‌పై ఐటీ దాడులు చేస్తే దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌జలంతా తీవ్ర షాక్‌కు గుర‌య్యే ఆస్తుల చిట్టా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంది. దీనికి కేంద్రం సిద్ధ‌ప‌డుతుందా? అంటూ ఒక‌టే ముచ్చ‌టా సాగుతోంది. అయితే బాబును ఎక్క‌డ‌, ఎప్పుడు, ఎలా ట‌చ్ చేయాలో? ఏ రేంజులో దెబ్బ కొట్టాలో తెలిసిన బ‌హుముఖ వ్యూహ‌క‌ర్త‌గా మోదీ నైపుణ్యం శ‌భాష్ అని పొగిడేయ‌కుండా ఉండ‌లేం!! హ‌త‌విధీ! అక్ర‌మార్కుల‌కు అక్ర‌మాస్తులు తెచ్చు అశాంతి దౌర్భాగ్య‌మే క‌దా.. చివ‌రికి మిగిలేది!!