జూన్ 7వ తేదీ నుండి మోడీ ఆ ప్లాన్ లో ఉన్నారా…?

Saturday, January 28th, 2017, 06:05:26 PM IST

modi1
పెద్దనోట్ల రద్దు అనేది ఇప్పటివరకు మనదేశంలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. దేశంలో ఉన్న పెద్దనోట్ల చలామణీని కేవలం నాలుగు గంటల వ్యవధిలో రద్దు చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. అయితే ఈ నిర్ణయానికి గత సంవత్సరం మే నెల లోనే బీజం పడినట్టు ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. సమాచార హక్కు చట్టం ద్వారా ఒక టీవీ ఛానల్ వేసిన పిటీషన్ కు సమాధానంగా ఆర్బీఐ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

నిజానికి కొత్త నోట్ల డిజైన్ కు గత సంవత్సరం మే 19న ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, ఆ తరువాతే కేంద్రం కూడా కొత్త నోట్లకు ఆమోదం తెలిపిందని ఆర్బీఐ చెప్పింది. భారత దేశాన్ని ఒక కుదుపు కుదిపిన పెద్దనోట్ల నిర్ణయానికి సరిగ్గా అయిదు నెలల ముందు అంటే జూన్ 7వ తేదీన కొత్త 2000 రూపాయలు, 500 రూపాయల నోట్ల డిజైన్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆర్బీఐ తెలిపింది. అయితే కొత్త 2000, 500 రూపాయల నోట్లను ముద్రించడానికి ఎంత కాలం పడుతుందని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆర్బీఐ సమాధానం చెప్పలేదు, ఈ సమాచారాన్ని వెల్లడిస్తే దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్బీఐ తన రిపోర్ట్ లో పేర్కొంది.