ప్ర‌ధాని మోదీ హ‌త్య ఎన్నిక‌ల స్టంటేనా?

Sunday, October 14th, 2018, 09:35:51 AM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని హ‌త్య చేస్తామంటూ మావోఇస్టుల విడుద‌ల చేసిన లేఖ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీన్ని ఆధారంగా చేసుకుని పౌర హ‌క్కుల నేత‌ల‌తో పాటు వ‌ర‌వ‌ర‌రావు వంటి నేత‌ల్ని…మోదీ ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా గొంతువిప్పుతున్న మావోఇస్టు పార్టీల సానుభూతిప‌రుల‌ను కేంద్రం అరెస్టులు చేయించ‌డం స‌ర్వ‌త్రా సంచ‌నం సృష్టించింది. ఇది బీజేపీపై దేశ‌వ్యాప్తంగా వున్న వ్య‌తిరేక‌త‌ను ఒక్క‌సారిగా త‌గ్గించి సానుభూతిని పొందాల‌నే ఎత్తుడ‌గ‌లో భాగంగానే ప్ర‌ధాని హ‌త్య జ‌ర‌గ‌బోతోంద‌నే పుకారును పుట్టించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. విప‌క్షాలు కూడా దీని వెనుక రాజ‌కీయ ల‌బ్ధి వుంద‌ని కొట్టిపారేశాయి.

తాజాగా మ‌రోసారి సారి ప్ర‌ధానిని హ‌త్య చేస్తామంటూ దిల్లీ పోలీస్ క‌మీష‌న‌ర్ అమూల్య ప‌ట్నాయ‌క్‌కు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపు లేఖ ఒక‌టి రావ‌డం దేశ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ బెదిరింపు లేఖ‌లో ప్ర‌ధాన న‌రేంద్ర మోదీని 2019 న‌వంబ‌ర్‌లో హ‌త్య చేయ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించ‌డం ఇంట‌లిజెన్స్ వ‌ర్గాల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. దీంతో ప్ర‌ధానికి మ‌రింత భ‌ద్ర‌త‌ను పెంచే విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌రు.
తాజాగా వ‌చ్చిన బెదిరింపు ఇమేయిల్ అస్సాం నుంచి వ‌చ్చిన‌ట్టు భ‌ద్ర‌తా వ‌ర్గాలు గుర్తించి న‌ట్లు తెలిసింది. దీంతో ప్ర‌ధాని పాల్గొనాల్సిన ర్యాలీల‌కు సంబంధంచి భ‌ద్ర‌తావ‌ర్గాలు హై ఎల‌ర్ట్ ప్ర‌క‌టించాయి.

దేశం వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల‌కు పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌.. పాకిస్థాన్‌లో కొత్త ప్ర‌భ‌త్వం మార‌డం వంట ప‌రిణామాల దృష్ట్యా భ‌ద్ర‌తా వ‌ర్గాలు తాజా బెదిరింపుల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ప్ర‌ధాని త‌ప్ప‌కుండా వెళ్లాలి. దీన్ని ఆస‌రాగా తీసుకుని విచ్చిన్న శ‌క్తులు ఆయ‌న హ‌త్య‌కు పూనుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతుంటే ఎన్నిక‌ల వేళ బీజేపీ ఆడుతున్న నాట‌క‌మ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు దుయ్య‌బ‌డుతున్నాయి.