మోడీ – రజినీ కలయిక సాధ్యమేనా?

Friday, February 23rd, 2018, 11:23:26 AM IST

తమిళ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరికీ తెలియదు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు ఉన్న పదవులు రేపు ఉంటాయో ఉండవో అనే పరిస్థితి అక్కడి రాష్ట్ర నాయకులకు బాగా తెలుసు. అందుకే పదవి ఎక్కడ పోతుందో అని పరిస్థితులను బట్టి నడుచుకుంటారు. రాజకీయాలంటే ఎవ్వరికైనా గుర్తొచ్చేది తమిళనాడే. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ పై ప్రస్తుతం దేశం మొత్తం ఆ రాష్ట్రం వైపే చూస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే.. భారత జనతా పార్టీ అక్కడ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అమిత్ షా అందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మరీనా విషయం ఏమిటంటే.. మరికొన్ని రోజుల్లో ప్రధాన మంత్రి మోడీ చెన్నైలో పర్యటించనున్నారు. గతంలో మోడీ వచ్చినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ ప్రముఖులను కలిసారు. కరుణానిధి ఇంటికి వెళ్లి మరి మోడీ ఆయనను పలకరించారు. అలాగే రజినీకాంత్ ని కూడా కలిసి చాలా సేపు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

అయితే ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. రజినీకాంత్ బీజేపీ తో కలిసే ఆలోచనలో లేరని ఆయన మాటల్లో చాలా సార్లు అర్థమైపోయింది. కాని మోడీ మాత్రం రజినీకాంత్ ని తప్పకుండా ఒప్పించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో చాలా సార్లు రజినీ బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదని డైరెక్ట్ గా చెప్పేశాడు. సొంతంగా పార్టీని నడిపించాలనే ఆలోచనతోనే ఉన్నారు. మరి ఇప్పుడు మోడీ పర్యటనలో రజినీ కలయిక ఎంత వరకు ఉంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు వారు కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా అని అనేక కథనాలు వెలువడుతున్నాయి. మరి ఎలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుందో చూడాలి.