దాయాదికి మ‌రో దెబ్బ‌: పాక్ గొంతెండిపోయే వ్యూహం!!

Saturday, November 26th, 2016, 02:59:42 AM IST

modi1
పాకిస్తాన్‌కి తాగు, సాగు నీళ్లు వ‌ద‌ల‌కుండా వ్యూహం ర‌చించారు భార‌త‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌వాదాన్ని పెంచిపోషిస్తున్న దాయాది పాకిస్తాన్‌కి అన్ని దారులు మూసేయాల‌న్న దుందుడుకు చూపిస్తూ ప్ర‌ధాని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ర్వాత వ‌రుస‌గా పాకిస్తాన్ దాడుల‌కు పాల్ప‌డి సైన్యంపై ఎటాక్ చేస్తోంది. ఇది ఎంత మాత్రం రుచించ‌ని మోదీ ఈ సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకున్నారు. అంత‌ర్జాతీయ జ‌ల యుద్ధానికి తెర తీశారు.

పాక్‌కు సింధూ జ‌లాల్ని వ‌ద‌లం! ఇక నుంచి తాగు, సాగు నీటికి క‌ట‌క‌ట‌లాడేలా చేస్తామ‌ని ప్ర‌ధాని ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు. రెండు దేశాల మ‌ధ్య యుద్ధం ముదిరితే అది ఏ రూపాన్ని తీసుకుంటుందో ఇండియా- పాక్ మ‌ధ్య న‌డుస్తున్న ప్ర‌చ్ఛ‌న్న యుద్ధాన్ని బ‌ట్టి చెప్పొచ్చు.