రాఫెల్ కుంభకోణంలో అసలు దొంగ మోదీయేనా?

Sunday, September 23rd, 2018, 01:46:42 PM IST

కాంగ్రెస్ ప్రెసిండెంట్ రాహుల్ గాంధీ ఎప్పుడు మోదీని టార్గెట్ చేయాలన్నా ఎంచుకునే అంశం రాఫెల్ ఒప్పందం. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని రాహుల్ ఎప్పుడు ఆరోపించినా మోదీ అండ్ టీమ్ స్పష్టమైన వివరాలు వెల్లడించకుండా దేశ భద్రతకు సంబందించిన అంశాలు రహస్యంగానే ఉంచాలంటూ విషయాన్ని దాటేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి మరొక తీగ చేతికి దిరికింది. రాఫెల్ ఒప్పందంలో భాగస్వామ్యం గురించి ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలండే మాట్లాడుతూ ఫ్రెంచ్ సంస్థ బసాల్ట్ కు భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థను భాగస్వామిగా ఎంచుకోవడమనేది భారత ప్రభుత్వ నిర్ణయమేనని అన్నారు. దీంతో మోదీ, బీజేపీ వ్యతిరేకులంతా ప్రభుత్వ విడి భాగాల తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉండగా కొన్ని రోజుల క్రితమే మొదలైన అంబానీ సంస్థకు ఇవ్వడమేమిటని నిలదీస్తున్నారు రాహుల్.

నిజమే మరి ఎలాంటి భారీ ఒప్పందంలో అయినా ముందు ప్రభుత్వ సంస్థల్ని ఇన్వాల్వ్ చేయడం పద్దతి. కానీ మన రక్షణ శాఖ మాత్రం విమాన విడి భాగాల తయారీలో ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేని అంబానీకి 30,000 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును ఇవ్వడం వెనుక ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదంటే నమ్మడమెలా. అదీగాక చాలా ఏళ్ల నుండి నలుగుతున్న ఈ ఒప్పందంలో మొదట్లో 120 విమానాల తయారీకి ఒక్కొకటి 400 కోట్ల చొప్పున మొత్తం 54,000 కోట్లని అంచనా ఉండగా ప్రస్తుత ఒప్పందంలో మాత్రం కేవలం 36 విమానాల తయారీకి 60,000 కోట్లు అనగా ఒక్కొక్కదానికి 1700 కోట్లు చెల్లిస్తోంది మోదీ ప్రభుత్వం. అనూహ్యంగా ఇంత పెరుగుదల ఎందుకో కూడ చెప్పలేదు.

ఇలా అడుగడుగునా అనుమానాలతో, రక్షణ రంగ నిధుల్ని భారీగా దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ ఒప్పందంలో నిజంగా అవినీతి జరగకపోతే మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా నోరు విప్పి వాస్తవాలను వెల్లడించవచ్చు కదా.