అలా సద్దుకోమంటున్న మోడీ..!

Sunday, November 27th, 2016, 12:38:15 PM IST

modi123
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ ఇబ్బందుల గురించి స్పందించారు.దేశం లో ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించుకోవాల్సిన సమయం వచ్చేసిందని మోడీ అన్నారు.పెద్ద నోట్ల రద్దు విషయం పై మన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు వలన ఇబ్బందులు కలుగుతుండడంతో ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపాలని సలహా ఇచ్చారు. ముఖ్యంగా యువత మొబైల్ మరియు ఈ బ్యాంకింగ్ లను వినియోగించుకోవాలని అన్నారు.

కాగా పెద్ద నోట్ల రద్దు వలన దేశవ్యాప్తంగా ప్రజల పడుతున్న ఇబ్బందులకు నిరసనగా ప్రతోపక్షాలు సోమవారం రోజున భరత్ బంద్ నిర్వహిస్తున్నట్లు పిలుపు నిచ్చాయి.పెద్దనోట్ల రద్దు అంశం దేశ రాజకీయాల్లో హీట్ ని పెంచుతోంది. దేశవ్యాప్తంగా విపక్షాలు ఆక్రోస్ దిన్ పేరుతో బంద్ కు పిలుపునిచ్చాయి. దేశవ్యాపితమగా బిజెపియోతర పార్టీ లు అయిన కాంగ్రెస్, వామపక్షాలు, శివసేన మొదలగు పార్టీ లన్ని బంద్ లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ప్రజలు పడుతున్న కష్టాలకు ఈ బ్యాంకింగ్ ని వాడుకోమని సలహా ఇవ్వడం సరైంది కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ బ్యాంకింగ్ ను అందరూ వాడుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. పేదప్రజల పరిస్థితి ఏంటని వారు మోడీని సూటిగా ప్రశ్నిస్తున్నారు.