మోడీ గారు మా గోడు వినండి : టీడీపీ నేతలు

Friday, July 13th, 2018, 04:06:31 PM IST

గత ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని టీపీడీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే అమరావతి అభివృద్ధి, పలు సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర నిధుల నుండి ఖర్చు చేస్తున్నారని, వారు గత ఎన్నికల సమయంలో చెప్పినట్లు నిధుల విడుదల సక్రమంగా జరిగివుంటే మనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అంటున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బాబు పడుతున్న శ్రమ వర్ణనాతీతమని, రాష్ట్రం ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ఉంటే మోడీ గారు చూస్తూ ఉండడం ఏ మాత్రం బాగోలేదని వారు విమర్శిస్తున్నారు. మేము మోసపోయినందువల్లనే ఎన్డీయే నుండి బయటకు వచ్చాము, ఆ విషయం వారికీ కూడా తెలుసునని అన్నారు.

అయినా ఇదివరకు ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇస్తామని ఇలా మోసగించిన దాఖలాలు లేవని, మోడీ చంద్రబాబు అంటే భయం పట్టుకుందని అన్నారు. ఎక్కడ చంద్రబాబు ఏపీ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తారేమో అనే భయం బిజెపి నేతల్లో కనపడుతోందని, అందుకే కుట్రపన్నుతూ మనకు రావలసిన ప్రాజక్టులు, నిధులను తొక్కిపెట్టారని అన్నారు. మోడీ విధానాల వల్ల ఇప్పటికే దేశంలోని చాల చోట్ల బీజేపీ ప్రభావాన్ని కోల్పోతోందని, రానున్న ఎన్నికల్లో వారి చాల చోట్ల భంగపాటు తప్పదని వారు అంటున్నారు. కడపకు స్టీల్ ప్రాజక్టు కోసం సియం రమేష్ దీక్ష చేస్తే కనీసం దానిపై స్పందించలేదని అన్నారు. అలానే టీడీపీ నేతలు బీజేపీ మోసంపై ధర్మ పోరాట దీక్షలు చేస్తుంటే వాటిని మేము రాజకీయ లబ్ది కోసం చేస్తున్నాం అని అనడం ఎంతవరకు న్యాయమని అన్నారు. కాబట్టి అయ్యా మోడీగారు ఎంతో కష్ట పరిస్థితుల్లో విడిపోయి నష్టపోయిన మా రాష్ట్రాన్ని పట్టించుకోండి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments