టెస్ట్ జట్టు లో చోటు సంపాదించిన హైదరాబాదీ!

Sunday, September 30th, 2018, 10:01:57 AM IST

వెస్టిండీస్ తో జరుగునున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ను ప్రకటించారు. ఈజాబితాలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్ట్ జట్టుకు చోటు సంపాదించాడు. అతని తోపాటు పృథ్వి షా, మయాంక్ అగార్వల్ లను ఈ సిరీస్ కు ఎంపిక చేశారు. ఇక ప్రధాన బౌలర్లు భువి, బుమ్రా లకు విశ్రాంతి నివ్వగా ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్య గాయాల కారణంగా సిరీస్ కు దూరం అయ్యారు.
శిఖర్ ధావన్ , మురళి విజయ్,కరుణ్ నాయర్ లపై వేటు వేశారు.

అక్టోబర్ 4నుండి ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో విండీస్ జట్టు అనుభవలేమితో బలహీనంగా కనిపిస్తుండగా, భారత్ హాట్ ఫేవరేట్ గా భరిలోకి దిగుతుంది. ఇక ఈ సిరీస్ లోనైన అవకాశం వస్తుందని ఎదురుచూసిన రోహిత్ శర్మ కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

భారత జట్టు :

విరాట్ కోహ్లీ (కెప్టెన్), చెతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, అజింక్య రహానె, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హనుమ విహారి, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌, శార్దూల్‌ ఠాకూర్‌

  •  
  •  
  •  
  •  

Comments