రాజకీయాల్లోకి స్టార్ హీరో.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ?

Wednesday, September 5th, 2018, 10:45:58 AM IST

దేశ రాజకీయాల్లో సినీ నటులు కూడా వారి సామర్ధ్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు పార్టీలను స్థాపించి సీఎం అవ్వాలనుకుంటే మరికొందరు డైరెక్ట్ గా కేంద్ర రాజకీయాల్లో కీలక పదవులపై టార్గెట్ పెడుతున్నారు. ప్రస్తుతం భారత జనతా పార్టీ ద్రుష్టి కూడా సినీ నటులవైపు మళ్లింది. ఎక్కువగా లోక్ సభ స్థానాలకు అభిమానులు ఎక్కువగా ఉన్న నటి నటులను దించాలను ప్రయత్నాలు చేస్తోంది. ఇక మలయాళం స్టార్ట్ హీరో మోహన్ లాల్ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మొదట్లో పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు సరికొత్తగా కమలం జెండా పట్టుకునేల ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. ప్రస్తుతం కేరళలో బీజేపీ అనుకున్నంత బలంగా లేదు. దీంతో ఎక్కువగా అభిమానులు ఉన్న మోహన్ లాల్ తో పార్టీని నడిపించాలని అనుకుంటున్నారు. ఇక మోహన్ లాల్ కూడా ముందు నుంచి మోడీ పాలనకు మద్దతు పలుకుతు వస్తున్నారు. రీసెంట్ గా తన విశ్వశాంతి ఫౌండేషన్ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించడానికి ప్రధానిని కలుసుకున్నారు. అదే విధంగా మోహన్ లాల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభోత్సవం, మలయాళి సదస్సుకు మోదీని ఆహ్వానించానన్నారు. మోహన్ లాల్ తిరువనంత పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments