1000 కోట్ల‌తో ఆసియా బిగ్గెస్ట్ ఫిలిం

Saturday, July 28th, 2018, 07:00:22 PM IST

దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్‌తో మ‌హాభార‌తంలోని ఓ కీల‌క ఘ‌ట్టం ఆధారంగా సినిమా తీస్తున్నామ‌ని ఇదివ‌ర‌కూ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ప్ర‌క‌టించారు. దుబాయ్‌కి చెందిన బిజినెస్ టైకూన్ బి.ఆర్‌.శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని తెలిపారు. ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత ఎం.టి వాసుదేవ‌న్ నాయిర్‌ నవ‌ల రంద‌మూజ‌మ్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నామ‌ని, రెండు భాగాలుగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆసియాలోనే ఇదో భారీ బ‌డ్జెట్ చిత్రం.

తాజాగా ఈ సినిమా గురుపౌర్ణ‌మి వేళ పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. భీముడి క‌థాంశం కాబ‌ట్టి ఇందులో టైటిల్ పాత్ర‌లో మోహ‌న్‌లాల్ న‌టించ‌నున్నారు. లాల్ ప్ర‌స్తుతం ఓడియ‌న్ అనే మ‌రో భారీ ఫాంట‌సీ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు ప‌లు సినిమాలు ఆయ‌న క్యూలో ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments