మొహమ్మద్ షమీకు గన్ మెన్ కావాలట..ఎందుకు?

Tuesday, October 2nd, 2018, 02:00:33 AM IST

భారత జట్టులోని ముఖ్య ఫాస్టెస్ట్ బౌలర్లలో మొహమ్మద్ షమీ కూడా ఒకరు.ఇటీవలే జరిగిన ఆసియ కప్ మ్యాచులకు దూరంగా ఉన్నాసరే షమీ అంతకు ముందు జరిగిన ఇంగ్లాడ్ టూర్లో తనదైన ప్రతిభ కనబరిచారు.ఇప్పుడు అక్టోబర్ నెలలో వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచులకు తన రక్షణ నిమిత్తం తనకి ఒక గన్ మెన్ కావాలని జిల్లా మేజిస్ట్రేటుకి లేఖ రాసినట్టు తెలుస్తుంది.దీనికి కారణం షమీకి హసిన్ జహాన్ అనే ఆమెతో ఇటీవలే పెళ్లి అయిన సంగతి తెలిసినదే.

కానీ ఆ తర్వాత ఆమె వైఖరి పట్ల షమీ చాలా నిరాశకు లోనయ్యాడు.ఆమె షమీపై లేని పోనీ అబాండాలను మోపుతుందని కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నాడు.ఆమె షమీపై వ్యభిచారం చేసేవాడని,అంతే కాకుండా మ్యాచుల్లో ఫిక్సింగ్ కి కూడా పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది,కానీ వీటిని అన్నిటిని పరిశీలించిన బీసీసీఐ అవన్నీ నిజం కాదని కొట్టి పడేసింది.షమీ ప్రస్తుతం తన తల్లి తండ్రులతో కలిసి ఉంటున్నాడు.కానీ ఇప్పుడు మ్యాచు నిమిత్తం బయటకు వెళ్లాల్సొస్తుందని,తన భార్యనుంచి తనకి రక్షణగా ఒక గన్ మెన్ కావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది.దీనిపై ప్రభుత్వం వారు కూలంకషంగా చర్చించి ఏర్పాటు చేస్తామన్నట్టు తెలిపారు.