రూ.251 కే స్మార్ట్ ఫోన్ అన్నాడు..8 వ తరగతి కుడా పాస్ కాలే..!!

Saturday, February 25th, 2017, 08:15:09 PM IST


రూ 251 కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ దేశమంతా హడావిడి చేశారు.ఇదో పెద్ద చీటింగ్ ఇప్పుడిపుడే బయటపడుతోంది.అతితక్కువకే స్మార్ట్ ఫోన్ అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ దేశమంతా ప్రచారం చేసుకుంది. కాగా ఆర్థిక నేరాల కేయూలో ఆ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్ ఇప్పటికే అరెస్టైయ్యారు. విచారణలో అతడి మోసాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి.

మోహిత్ గోయల్ లింక్డ్ ఇన్ వెబ్ సిట్ లో తాను అమిటీ యూనివర్సిటీ లో ఎంబీఏ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. కానీ అతడు చదివింది 8 వ తరగతి వరకు మాత్రమే అట. అదికూడా పాస్ కాలేదట. కానీ ఇంగ్లిష్ లో మాట్లాడేందుకు స్పొకె ఇంగ్లిష్ కోర్స్ చేసినట్లు మాత్రం అతడు పేర్కొన్నాడు. రూ 16 లక్షల మేర రింగింగ్ బెల్స్ సంస్థ తమకు చెల్లించాలని అయామ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు మోహిత్ ని అరెస్టు చేశారు.