విడుదలకు ముందే సంచలనం

Sunday, September 14th, 2014, 04:08:01 PM IST


ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ పుస్తకం విడుదలకు ముందే సంచలనాన్ని సృష్టించింది.ఇప్పటికే ఆయన రాసిన పుస్తకాలు సినిమాగా తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రచయిత రాసిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని.. సినిమాగా రుపొందిస్తానని ప్రముఖ బాలివుడ్ దర్శకుడు మొహిత్ సూరి వెల్లడించడం సంచలనాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే.. మొహిత్ సూరి వంటి ప్రతిభావంతులైన దర్శకుడు తను రాసిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ పుస్తకాన్ని సినిమాగా తీస్తామనడం సంతోషంగా ఉన్నదని చేతన్ భగత్ మైక్రోబ్లాగ్ సైట్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.