పూరితో రానున్న మోక్షజ్ఞ… ?

Thursday, November 15th, 2018, 07:19:21 PM IST

నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా తన కుమారుడి రాక కోసం బాలయ్య అభిమానులు గత కొంత కాలంగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం లో ఎంట్రీ లేకపోయినా కూడా, తన వారసుడి తోలి చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేదే చర్చనీయాంశంగా మారింది. అయితే దర్శకుడు దొరికేశాడంటూ వచ్చిన వార్తలతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రముఖ హీరోల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే అది వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వాళ్ళకి తగ్గ కథ, దానికి తగిన దర్శకుడు, సినిమాని కరెక్టుగా మార్కెట్ చేయగలిగే యూనిట్ ఇలా అన్ని సరిగ్గా కుదరాలి.
ఇప్పుడు బాలయ్య కూడా తన కుమారుడి ఎంట్రీ కి అలాగే ఇబ్బంది పడుతున్నాడు. బాలయ్య ఎంపిక చేసిన దర్శకుల లిస్ట్ లో చాల మంది పేర్లు వినియోఇంచినప్పటికీ చివరగా ఆ అవకాశం పూరి జగన్నాథ్ ని వరించిందని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నప్పటికిని, గత రెండు సంవత్సరాలుగా అతడి ఎంట్రీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అయినప్పటికిని మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఇప్పుడు కాదని, మళ్ళీ వచ్చే ఏడాదిన నందమూరి వారసుడు ఎంట్రీ ఉండబోతుందని చెప్తున్నారు. తాజాగా బాలయ్య తన వారసుడి చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతని పూరికి ఇచ్చినట్లు సమాచారం. పైసా వసూల్ సినిమాతో వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు. ఇంకా కొత్త హీరోలని, వారసులని చిత్ర సీమ కి పరిచయం చేయడంలో పూరి ది అండ్ వేసిన చెయ్యి. మరి ఈ అవకాశాన్ని పూరి జగన్నాధ్ ఎలా వాడుకుంటాడో అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.