చంద్రుని పక్కన ఏలియన్..వైరల్ అవుతోన్న వీడియో!

Saturday, February 3rd, 2018, 11:56:15 AM IST

152 ఏళ్ల తరువాత 2018 జనవరి 31న సూపర్ బ్లూ, బ్లడ్ మూన్‌ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది. ప్రపంచం మొత్తంలో చాలా మంది ప్రజలు ఆ చంద్రగ్రహనాన్ని చూశారు. అయితే అదే రోజు ఎవరు ఊహించని విధంగా చంద్రుని పక్కన నుంచి ఏలియన్ వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. హంటర్లకు యూఎఫ్ఓ కనిపించడం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. నాసా విడుదల చేసిన ఆ వీడియోలో చంద్రుని పక్క నుంచి ఎదో వెలుగు వెళ్లడం ఇప్పుడు కొత్త భయాన్ని కలిగిస్తోంది. మనిషి కి సంబందించిన ఏ వస్తువు ఆ స్పీడ్ లో వెళ్లదు అని తప్పకుండా అది ఒక ఏలియన్ కి సంబందించినదే అని యూఎఫ్ఓ అని ఏలియన్ హంటర్లు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింద. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం బోయింగ్ ఎయిర్ క్రాప్ట్ లేదా వెదర్ బెలూన్ అని చెబుతున్నారు. కానీ అధికారికంగా ఎవరు ఇంకా ఈ విషయంపై నిర్దారణ ఇవ్వలేదు.