ఏపీలో జరిగే ఆప‌రేష‌న్లు.. ఇంటెలిజెన్స్ కంటే ముందు.. సినీ ప్ర‌ముఖుల‌కు ఎలా తెలుస్తున్నాయి..?

Saturday, November 10th, 2018, 11:47:40 AM IST

ఏపీలో భారీ కుట్ర‌కి ఒక‌ జాతీయ పార్టీ తెర‌లేపింద‌ని.. అందులో భాగంగానే ఏపీని త‌న చేతుల్లోకి తెచ్చుకునేందుకు.. ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో రంగంలోకి దిగ‌బోతుంద‌ని ఏడు నెల‌ల క్రితం సినీ న‌టుడు శివాజీ మ్యాప్ గీసి మ‌రీ చెప్పి సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా నాడు శివాజీ చెప్పిన‌ట్టు ఒక ప్ర‌తిప‌క్ష ముఖ్య‌నేత పై దాడి జ‌రిగిద్ద‌ని చెప్ప‌గా.. ఇటీవ‌ల ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఇక జ‌గ‌న్ పై దాడి త‌ర్వాత.. ఏపీలో నెక్స్ట్‌ టార్గెట్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అని.. అందులో భాగంగా చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వబోతోంద‌ని శివాజీ చెప్పారు. అయితే శివాజీ చెప్పినప్పుడు మొద‌ట అంద‌రూ లైట్ తీసుకున్నా, జ‌గ‌న్ పై దాడి జ‌రిగాక ఆప‌రేష‌న్ గ‌రుడ నిజ‌మే అనే అనుమానాలు అంద‌రిలో త‌లెత్తాయి. ఇక క్ర‌మంలో మ‌రో ఆప‌రేష‌న్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో త్వ‌ర‌లోనే ఆపరేష‌న్ – బి స్టార్ట్ అవ‌బోతోంద‌ని టాలీవుడ్ ద‌ర్శ‌క, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌రద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆపరేష‌న్ – బిలో భాగంగా 15 రోజుల్లో టీడీపీకి చెందిన 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై ఐటీ దాడులు జ‌రుగ‌నున్నాయ‌ని త‌మ్మారెడ్డి తెలిపారు. దీంతో త‌మ్మారెడ్డి వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేప‌గా.. సామాన్యులు మాత్రం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. నాడు ఆపరేష‌న్ గ‌రుడ‌ని సినీన‌టుడు శివాజీ ముందుగానే లీక్ చేశారు.. ఇప్పుడేమే ఆప‌రేషన్-బి అంటూ తమ్మారెడ్డి మ‌రో ఆప‌రేష‌న్‌ను లీక్ చేశారు.. మ‌రి ఇలాంటి సీక్రెట్ ఆప‌రేష‌న్ల గురించి రాజ‌కీయ వ‌ర్గాలు, ఇంటెలిజెన్స్ కంటే ముందుగా సినీ జ‌నాల‌కు ఎలా తెలుస్తున్నాయ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments