అలాంటి అబ్బాయిలకే ఎక్కువమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారట.. తెలుసా..!!

Saturday, June 11th, 2016, 02:22:17 AM IST


సాధారణంగా యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిల్లో తమకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉండటం సహజం. కానీ ఎంత ప్రయత్నించినా కొంతమంది అబ్బాయిలకి అస్సలు గర్ల్ ఫ్రెండ్స్ దొరకరు. కొందరు అబ్బాయిలకి మాత్రం చాలా మంది గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. అలాంటి వాళ్ళను చూసినప్పుడల్లా గర్ల్ ఫ్రెండ్స్ లేని అబ్బాయిలు వాళ్ళకి తమకి తేడా ఏమిటబ్బా అనే ధర్మ సందేహంలో పడిపోయి వాళ్లకి వాళ్ళే తమలో లేని కొత్త లోపాలను వెతుక్కుని తెగ ఫీలైపోతుంటారు.

ఈ సమస్యకు పరిష్కారం అసలు మ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారో తెలుసుకోవడమే. సహజంగా అమ్మాయిలు తమతో ఓపెన్ గా ఉంటూ తమ ఫీలింగ్సును షేర్ చేసుకుని తమ పట్ల కాస్త జాగ్రత్త చూపుతూ, తమ సమస్యల పట్ల స్పందించి సానుభూతి తెలుపుతూ జన్యూన్ గా వ్యవహరించే అబ్బాయిలతో స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారట. కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ లేరని భాదపడే అబ్బాయిలంతా ఇకపై అమ్మాయిలతో ఓపెన్ మైండెడ్ గా ఉండటానికి ట్రై చేస్తే మంచిది.