లోకేష్ మీద ఒట్టేసి చెబితే ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి

Wednesday, May 30th, 2018, 11:39:34 AM IST

సీనియర్ నాయకుడిగా తెలుగు దేశం పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన తెలుగు దేశం నాయకుడైన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ పార్టీలో ఉన్న వారికి మంచి న్యాయం చేస్తుంటే చంద్రబాబు మాత్రం మోసం చేస్తున్నట్లు మోత్కుపల్లి వివిధ రకాల కామెంట్స్ చేయడంతో పార్టీ నుంచి బహిష్కరించారు.

అయితే మోత్కుపల్లి కావాలనే విమర్శలు చేస్తున్నారని గతంలో చంద్రబాబుని గవర్నర్ పదవి అడిగాడని అది రాకపోవడంతో ఈ విధంగా విమర్శలు చేస్తున్నట్లు ఎల్ రమణ ఇటీవల మహానాడులో తెలిపారు. అదే విషయంపై మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఎల్.రమణ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తాను ఎవరిని ఏ పదవి కోరలేదని అన్నారు. అదే విధంగా తాను గవర్నర్ పదవి కోరినట్లు చంద్రబాబు తన కొడుకు లోకేష్ పై ప్రమాణం చేసి నిరూపిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడనని మోత్కుపల్లి ఛాలెంజ్ విసిరారు. ఇక చంద్రబాబు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడిపోవడానికి తాను తిరుమల మెట్లు ఎక్కి దేవున్ని వేడుకుంటానని మోత్కుపల్లి తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments