మోటోరోలా వన్ పవర్..న్యూ మొబైల్!

Tuesday, July 31st, 2018, 08:42:19 PM IST

స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య రోజు రోజుకి పోటీ తీవ్రత చాలా పెరుగుతోంది. అందరికి అందుబాటులో ఉండే ధరల్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని అందించడంలో మోటోరోలా కంపెనీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇకపోతే త్వరలోనే ఈ కంపెనీ నుంచి మరో సరికొత్త ఆండ్రాయిడ్ మొబైల్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. దాదాపు 24 వేల రూపాయలతో విడుదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ ను వన్ పవర్ పేరుతో ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చారు. ఇప్పటికే మోటోరోలా నుంచి విడుదలైన ఫోన్లు మార్కెట్ లో మంచి బ్రాండెడ్ పోన్లుగా అమ్ముడుపోతున్నాయి. నాణ్యత ఈ ఫోన్లలో ఎక్కువగా ఉన్నట్లు కస్టమర్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. ఇక వన్ పవర్ మొబైల్ అందరిని ఆకట్టుకునే ఫ్యూచర్స్ తో బ్లాక్, వైట్, గోల్డ్, సిల్వర్ కలర్లలో అందుబాటులోకి తేనున్నారు.

మోటోరోలా వన్ పవర్ ఫ్యూచర్స్:

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
బ్యాక్ సైడ్ 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
6.18″ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3/4/6 ర్యామ్ – 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (128 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
4850ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)