‘మా’ వివాదం.. హైడ్రామా నడుస్తోందా?

Saturday, September 15th, 2018, 04:42:28 PM IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల అనేక వివాదాలు అనుమానాలను కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం మా అద్యక్షుడిపైనే ఆరోపణలు రావడం మరింత వైరల్ అయ్యింది. జెనరల్ సెక్రెటరీ నరేష్ అధ్యక్షుడైన శివాజీపైన నిధుల దుర్వినియోగం చేశారని ఇష్టానుసారంగా మీడియా ముందు వివరించడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే గొడవ జరిగినప్పుడు సినీ పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేడు మీడియా ముందుకు వచ్చి మేమంతా ఒకేటే అనడంతో ఇంత హైడ్రామా ఎందుకని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నరేష్ – శివాజీ రాజా మీటింగ్ లో ఎడ మొహం పెడ వేసుకొని కూర్చున్నారు. ఇండస్ట్రీ పరువు ఎవరైతే కాపాడాలో వారే ఈ వ్యతిరేఖంగా వ్యవహరించి మళ్ళీ నేడు ఇలా దర్శనమివ్వడమేంటని పలు మీడియాల్లో కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం మాత్రమే మా సభ్యులు మళ్ళీ ఇలా తెరపై నటిస్తున్నట్టు నవ్వుకుంటూ కనిపిస్తున్నారని ఆరోపణలు వేస్తున్నాయి. ఇక తెరవెనుక మళ్ళీ గొడవలు కామన్ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది అంటూ రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మా పెద్దలు ఈ విధంగా చేయడం ఇండస్ట్రీకి కరెక్ట్ కాదని ఈ పని ముందే చేసి ఉంటే బావుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments