మూవీ ప్రివ్యూ టాక్ : శ్రీనివాస కళ్యాణం!

Thursday, August 9th, 2018, 08:52:36 AM IST

యంగ్ హీరో నితిన్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా శతమానంభవతి చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నేడు విడుదల కానున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రివ్యూ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం. గత చిత్రం వలె సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని కూడా ఒక క్లీన్ ఫామిలీఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఆ చిత్రంలో కుటుంబ అనుబంధాల గురించి చెప్పిన దర్శకుడు, దీనిలో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయబద్దంగా వివాహానికి వున్న ప్రాశస్త్యాన్ని ఎంతో చక్కగా చూపించారు. నేటి కాలంలో పెళ్లి అంటే ఏదో ఒకపూట గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే ఫంక్షన్ కాదని, అది బంధాలు మరియు బంధువులు కలగలిసిన ఒక అపూర్వ వేడుక అని చెప్పే ప్రయత్నం చేసారు.

నిజానికి సతీష్ చేసిన ఈ ప్రయత్నం చాలావరకు ఆకట్టుకుంటుంది అనే చెప్పుకోవాలి. సినిమా మొత్తం కూడా భారీ తారాగణంతో ఒక నిండుతనంతో సాగింది. ఇక ముఖ్య పాత్రల్లో నటించిన జయసుధ, ప్రకాష్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, సితార వంటి ఎందరో సీనియర్ నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇకపోతే సినిమాను చిత్రీకరించిన సమీర్ రెడ్డి, తన అద్భుతమైన ఫోటోగ్రఫీతో సినిమాను ఎంతో గ్రాండియర్ చూపించడంలో సఫలమయ్యారు అనే చెప్పాలి. ఇక ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు మరియు ముఖ్యంగా సంగీతం అందించిన మిక్కీ జె మేయర్ సినిమాకి మరొక బలంగా చెప్పుకోవచ్చు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఫుల్ లెంగ్త్ ఫామిలీ ఎంటెర్టైనెర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులా,

ఈ చిత్రం కూడా తప్పకుండ కేవలం ఫ్యామిలీలని మాత్రమే కాకుండా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ లభించి, మంచి విజయవంతం అయ్యేఅవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తంగా చెప్పుకుంటే ఈ చిత్రం మొదటినుండి ఎక్కడ కూడా పెద్దగా గాడి తప్పకుండా, చాలావరకు తాము చెప్పదలుచుకున్న పాయింట్ ని సూటిగా చెప్పడంలో సతీష్ కు మంచి మార్కులు పడ్డట్లు తెలుస్తోంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ ఈ శ్రీనివాస కళ్యాణం చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎబోవ్ యావరేజ్ చిత్రంగా నిలబడే అవకాశం కనపడుతోందని ప్రివ్యూ చూసిన వారు చెపుతున్నారు. అయితే నేడు విడుదలకానున్న ఈ చిత్రానికి ఎటువంటి ప్రేక్షకాదరణ లభిస్తుందో వేచి చూడాలి….

  •  
  •  
  •  
  •  

Comments