అది నిరూపిస్తే.. ట్యాంక్ బండ్‌పై ఉరేసుకుంటా : ఎంపీ బాల్క సుమన్

Saturday, July 7th, 2018, 09:33:24 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రముఖ నాయకుడు ఎంపీ బాల్క సుమన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని బల్క సుమన్ తెలిపారు. కావాలనే దృష్ప్రాచారం చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ ఆరోపణల్లో నిజం ఉందని నిరూపిస్తే ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానన్నారు. తనపై మంచిర్యాలకు చెందిన అక్కా చెల్లెల్లు కుట్ర పన్నారని వివరించారు.

సుమన్ వివరిస్తూ.. బోయిని సంధ్య, బోయిని విజేతలు అక్కాచెల్లెళ్లు. సంధ్య నన్ను మోసం చేయాలని ఆరు నెలల ముందే ప్లాన్ చేసింది. నా భార్య కొడుకుతో దిగిన ఫొటోలను సంధ్య ఆమె ఫొటోతో మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలనీ అనుకున్నారు. ఆమెపై ఈ ఏడాది జనవరి 27న పోలీసులకు పిర్యాదు చేసినట్లు సుమన్ తెలుపుతూ.. ఫిబ్రవరి 6న వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఇక మళ్ళి మరోసారి అక్క చెల్లెల్లు తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేశారని అందుకే బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక బల్క సుమన్ పై వచ్చిన లైంగిక ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలుపుతూ మహిళలు చూపించిన ఆధారాల్లో నిజం లేదని పోటోలను మార్ఫింగ్ చేశారని మంచిర్యాల సిఐ మహేష్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments