మహేష్ బాబు బావకి తప్పిన ప్రమాదం

Friday, April 29th, 2016, 03:06:31 PM IST


ఆంధ్రప్రదేశ్ వ్యాపార దిగ్గజం, టీడీపీ ఎంపీ అయిన మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ కు ప్రమాదం తప్పింది. వ్యాపార పనుల నిమిత్తం బయట ప్రాంతానికి వెళ్ళిన ఆయన తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టు ద్వారా విజయవాడకు వస్తుండగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది.

ముందు వెళుతున్న ఆటోను తప్పించబోయి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా వెనుక నుండి వచ్చిన మరో కారు జయదేవ్ కారును వెనుక నుండి డీ కొట్టింది. దీంతో ఆయన కారు పక్కనే ఉన్న ఇసుక దిబ్బను గట్టిగా గుద్దుకుంది. ఇంతలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో జయదేవ్ ఎటువతి గాయాలు లేకుండా తప్పించుకున్నారు. అనంతరం ఆయన మరో కారులో అక్కడి నుండి వెళ్ళిపోయారు.