తిరుమలేశుని పై ఎంపి కనిమొళి వివాస్పద వ్యాఖలు!

Thursday, January 11th, 2018, 09:54:57 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి కుమార్తె ప్రముఖ ఎంపి కనిమొళి కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన తిరుమల వెంకటేశ్వర స్వామి పై వివాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు ప్రచారం లోకి వస్తున్నాయి. పేదవాడిని కాపాడలేని దేవుడు మనకి ఎందుకు? అవసరం లేదు. దేవుడి ముందు అంతా సమానమే అని నీతులు చెపుతుంటారు, వాస్తవానికి దేవుడు దగ్గరకి డబ్బున్నవారు ప్రత్యేక దర్శనం పేరుతో త్వరగా దర్శనం చేసుకుని వెళ్తుంటారు, అదే సామాన్యులు అయితే గంటల త్వరపడి క్యూలో నిలబడితేనే గాని ఆయన దర్శనం దొరకదు. తన హుండీని తాను కాపాడుకోలేని దేవుడు ఇంక మనల్ని ఏమి కాపాడుతాడు అని ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ప్రపంచంలో ని ఎంతో మంది కలియుగ ప్రత్యక్ష దైవం గా కొలిచే తిరుమలేశుని పై ఈ విధంగా కించపరిచేలా మాట్లాడడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అని పలువురు తప్పుపడుతున్నారు.కేవలం అటు తమిళనాడు లోనే కాక, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెని దుయ్యపడుతున్నారు. ‘దేవుడిని విమర్శిస్తున్నావు కాబట్టే అరెస్టు అయి పరువు పోగుట్టుకున్నావు’ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వు 2జి స్పెక్ట్రమ్ స్కాం లో ఇరుక్కునపుడు నీ కుటుంబ సభ్యులు ఇదే దేవుడికి మొక్కుకున్నారని వారు గుర్తు చేశారు….