కేసీఆర్ తరువాత ఎవరు..కవిత సమాధానం ఇదే..!

Tuesday, January 30th, 2018, 05:35:34 PM IST

భారత దేశ రాజకీయాల్లో వారసత్వం చాలా సాధారణంగా మారిపోయింది. తండ్రుల తరువాత కొడుకులు.. వారి తరువాత వారి కొడుకులు ఇలా రాజకీయ వారసత్వం ఇండియాలో కొనసాగుతూనే ఉంది. ఈ వారసత్వ రాజకీయాలకు పెద్ద ఉదాహరణ ఎక్కువ కాలం ఇండియాని ఏలిన కాంగ్రెస్ పార్టీనే. ఇక సౌత్ ఇండియాలో ఈ వారసత్వ రాజకీయాలు బలంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల రాజకీయాల్లో వారసత్వాన్ని చూస్తూనే ఉన్నాం.

ఆంధ్రప్రదేశ్ లో అయితే జగన్, నారా లోకేష్ లో రేసులోకి వచ్చేశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ తరువాత టిఆర్ఎస్ బాస్ ఎవరనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మరో మారు ఏ ప్రశ్న కేసీఆర్ తనయి, ఎంపీ కవితకు ఎదురైంది. ఈ ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కేసీఆర్ వారసులు ఎవరో భవిష్యత్తులో తేలుతుందని కవిత అన్నారు. మంత్రి కేటీఆర్.. కేసీఆర్ రాజకీయ వారసుడిగా లీడ్ లో ఉన్నతరుణంలో కవిత వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. తెలంగాణ సచివాలయంలోకి వచ్చిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్, జేఏసీ నేత కోదండరాం పై కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందని అన్నారు. కోదండరాం పార్టీ పెడితే ఆహ్వానిస్తాం అని అన్నారు.