రాందేవ్ బాబాతో ఎంపీ కవిత..?

Tuesday, April 10th, 2018, 01:19:05 PM IST

నిజామాబాద్‌కు వచ్చిన యోగా గురువు బాబా రాందేవ్‌ను ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక గుర్బాబాది రోడ్‌లో ఉండే తన శిష్యుడు పవన్‌కుమార్ కేడియా నివాసంలో బాబారాందేవ్ బస చేయగా, ఎంపీ కవిత ఆయనను కలిశారు. యోగా శిబిరం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఎంపీ కవితను బాబారాందేవ్ ఆహ్వానించారు. అలాగే మంత్రి హరీశ్‌రావుకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఎంపీ కవిత వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాంకిషన్‌రావు, రెడ్‌కో చైర్మన్ అలీం ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments