15 రోజులు.. 10 దేశాలు.. ఇదీ క‌విత‌క్క టూర్‌

Monday, September 26th, 2016, 10:43:31 AM IST

kavitha
కీల‌క‌మైన అంశాల్ని హ్యాండిల్ చేయాల్సిన సంద‌ర్భం వ‌స్తే ..తండ్రి కేసీఆర్ లానే ముక్కుసూటిగా వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టే నేత‌గా పేరు తెచ్చుకుంటున్నారు క‌విత‌. ఇటీవ‌లి కాలంలో సోద‌రుడు కేటీఆర్‌ని మించి త‌న‌దైన శైలి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌కీయాల్లో త‌న‌దైన మార్క్ వేస్తూ భ‌విష్య‌త్ సీఎం అభ్య‌ర్థిగానూ పాపుల‌ర‌వుతున్నారు.

అంతేకాదు కల్వ‌కుంట్ల క‌విత బ‌తుక‌మ్మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నైజాం లోగిళ్ల‌లో బోలెడంత ఆప్యాయ‌త‌ల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు బ‌త‌కమ్మ‌కి ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు తెచ్చే ప్ర‌య‌త్నాల‌తో అంద‌రి దృష్టిలో ప‌డుతున్నారు. 15 రోజుల పాటు ఏకంగా 10 దేశాలు తిరిగి బ‌తుక‌మ్మ‌కు ప్ర‌చారం తెచ్చే ప‌నిలో ఉన్నారు. తెలంగాణ క‌ల్చ‌ర్‌ని విశ్వ‌వ్యాప్తం చేయ‌డ‌మే క‌వితక్క‌ ఎజెండా. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 1న లండ‌న్ (యుకె), 2న శాన్ ఫ్రాన్సిస్కో(అమెరికా), 8న సిడ్నీ (ఆస్ట్రేలియా), 9న ఆక్లాండ్(న్యూజిలాండ్), 13న కువైట్, 4న బహరైన్, 15న కోపెన్ హగన్(డెన్మార్క్) దేశాల్లో పర్యటించ‌నున్నారు.