సచిన్ ఫ్రెండ్ కనుమరుగైంది అందుకే..ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, December 28th, 2016, 03:54:36 PM IST

sachin
క్రికెట్ దిగ్గజం సచిన్ మరియు అతని చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఇద్దరూ కలిసే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారు. కానీ సచిన్ లా వినోద్ కాంబ్లీ కెరీర్ ఎక్కువకాలం సాగలేదు. దీనికి కారణం కాంబ్లీ దళితుడు కావడమే అని ఓ బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదానికి తెర తీశారు. బిజెపి కి చెందిన దళిత ఎంపీ ఉదిత్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. వినోద్ కాంబ్లీ దళితుడు కావడం వల్లే అతడి క్రికెట్ కెరీర్ త్వరగా ముగిసిందని ఉదిత్ రాజ్ ట్వీట్ చేయడం విశేషం. ఇదే నిజమని.. కాంబ్లీ దళితుడిని ఒప్పుకోవడం లో సిగ్గుపడకూడదని అన్నారు.

ఉదిత్ వ్యాఖ్యలపై కాంబ్లీ కూడా ఘాటుగా స్పందించాడు. తన కులానికి, కెరీర్ కు ఎలాంటి సంబంధం లేదు. మిస్టర్ రాజ్.. దయచేసి నాపేరుని ఇకముందు ఉపయోగించకండి అంటూ ఘాటుగా బదులిచ్చాడు. ఉదిత్ వ్యాఖ్యల పై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఆయన మానసిక స్థితి సరిగా నేలేదని అంటున్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయవద్దని మండిపడుతున్నారు. కాగా సచిన్, వినోద్ కాంబ్లీ లు ఇద్దరూ స్కూల్ క్రికెట్ నుంచే మంచి ప్రతిభ కనబరచి టీం ఇండియా లో చోటు దక్కించుకున్నారు. సచిన్ అసమాన ప్రతిభ తో అంచలంచెలుగా ఎదగగా కాంబ్లీ త్వరగానే క్రికెట్ కు దూరమయ్యాడు.

  •  
  •  
  •  
  •  

Comments