మోడీ బావ.. హిజ్రా వేషంలో ఎంపీ శివప్రసాద్ సెటైర్!

Friday, August 10th, 2018, 02:56:15 PM IST

ప్రత్యేక హోదా కోసం గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీ నేతలు వినూత్న రీతిలో బిజెపిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ రకాల వేషధారణలో మోడీని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మోడీ బావా అంటూ ట్రాన్స్ జెండర్ గా దర్శనమిచ్చారు. అందుకు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ప్రశంసలు కురిపించారు. ఇక హిజ్రా వేషంలో కనిపిస్తూ మీడియాని ఆకర్షించారు. అదే విధంగా దానికి వేషధారణకు తగ్గట్టు “ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం” అంటాయి పాట పాడుతూ మోడీపై సెటైర్లు వేశారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తు డిమాండ్లు నెరవేర్చకపోతే అవుటయ్యి పోతావు అంటూ పేర్కొన్నారు. చంద్రబాబుకి కోపం కూడా తట్టుకోలేవు అనే విధంగా ప్రశ్నించడంతో సోషల్ మీడియాలో ఆయన వీడియో మరోసారి వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments