అవి బాబు మార్క్ విచారణలు – ఎంపీ విజయసాయిరెడ్డి..!

Friday, November 9th, 2018, 02:53:25 PM IST

విశాఖ భూ కుంభకోణం లో సిట్ నివేదిక పై వైసీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి “చంద్రబాబు అండ్ కో” పై ట్విటర్ ద్వారా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని, నిత్యం కట్టుకతలు అల్లుతూ, అసత్యాలు నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని, ఇలాంటి జబ్బు ఉన్న వారిని ఇంటికే పరిమితం చేయాలనీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పబోతున్నారని హెచ్చరించారు. సిట్ నివేదికపై తనదైన శైలి విమర్శించారు విజయసాయిరెడ్డి, భూ కుంభకోణం పై చంద్రబాబు స్వీయ దర్శకత్వంలో తయారైన “హిస్ మాస్టర్స్ వాయిస్” లా ఉందని, కుంభకోణం ప్రధాన విలన్లు అయిన యెల్లో గ్యాంగ్ లో ఒక్కరి మీద కేసులు లేకుండా తప్పించుకున్నారని అన్నారు. ఆ విషయంలో మాస్టర్ పై తన విశ్వాసం చాటుకున్నారు సిట్ అధికారులు అంటూ ట్వీట్ చేసాడు.

రిషితేశ్వరి మరణం, వనజాక్షి పై దాడి, నారాయణ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలు, పుష్కరాల్లో తొక్కిసలాట, లాంచీ ప్రమాదం, రత్నాచల్ రైలు దగ్ధం, కాల్ మని రాకెట్, విశాఖ కుంభకోణం వరకు జరిగిన అన్ని విచారణల్లో నిజమైన దోషిని పట్టుకోలేదు, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు, ఇవే బాబు మార్క్ విచారణలు అంటూ తనదైన శైలిలో సిట్ నివేదిక పై మంది పడ్డారు విజయసాయిరెడ్డి.