కోహ్లీ పోయే..! డివిల్లియర్స్ వచ్చే..!

Saturday, September 8th, 2018, 03:41:43 PM IST

కంగారు పడకండి ఇది ఐపీఎల్ మ్యాచ్ ల వరకే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్ గా స్టైలిష్ బ్యాట్సమెన్ విరాట్ కోహ్లీని తప్పించి ఆ భాద్యతను మిస్టర్ 360 ఏ బి డివిలియర్స్ కి అప్పగించినట్టు తెలుస్తుంది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీం ఇండియా కు కోహ్లీ కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించాడు కానీ ఐపీఎల్ ఫార్మాట్ లో మాత్రం విఫలమవుతున్నాడు.

ప్రతీ ఏటా జరిగే ఐపీఎల్ మ్యాచులకు ఎలాంటి ఆధరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, అందులోను చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులకున్న ఆధరణ వేరే లెవిల్లో ఉంటుంది. ఐతే ఇప్పటికి చెన్నై మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ ని సాధించింది కానీ బెంగళూరుకు మాత్రం దురదృష్టం అలా వెంటాడుతూనే ఉంది ఫైనల్స్ వరకు వచ్చి కూడా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనితో ఈ సారి ఎలా అయినా ట్రోఫీ గెలవాలి అని నిర్ణయించుకున్న బెంగళూరు యాజమాన్యం వారి కోచ్ ను మరియు జట్టు సారధిని మార్చాలని భావించి ముందు జట్టు కోచ్ వెట్టోరి స్థానం లో గ్యారీ కిరిస్టెన్ కు భాద్యత అప్పగించింది అదే విధంగా కెప్టెన్ స్థానం నుంచి కోహ్లీని తప్పించి డివిలియర్స్ కి పగ్గాలు అప్పగించింది.

  •  
  •  
  •  
  •  

Comments