అఖిల్ ఈసారైనా క్లిక్ అవుతాడా..?

Monday, March 11th, 2019, 04:25:56 PM IST

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన సినిమా మిస్టర్ మజ్ను, ఈ సినిమా అఖిల్ కు నిరాశే మిగిల్చిందన్న సంగతి తెలిసిందే. మిస్టర్ మజ్ను ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. తన కెరీర్ ప్రారంభం నుండి అఖిల్ మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు, అయినప్పటికీ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.

నాగచైతన్య లాంచింగ్ విషయంలో జరిగిన తప్పులు అఖిల్ లాంచింగ్ లో రిపీట్ అవ్వకూడదని భావించి నాగార్జున పకడ్బందీగా ప్లాన్ చేసి ఎన్నో అంచనాలతో వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ సినిమా ద్వారా లాంచ్ చేస్తే అది అనూహ్యంగా దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన హలొ సినిమా కూడా అఖిల్ కెరీర్ కు పెద్దగా లాభపడలేక పోయింది, ఇక మిస్టర్ మజ్ను సినిమాపై డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ ఆ సినిమా అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. వెండితెరపై వర్కౌట్ అవ్వని మిస్టర్ మజ్ను మ్యాజిక్ స్మాల్ స్క్రీన్ మీద ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.