తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన గుజరాత్ యువ సంచలనం..!

Wednesday, January 17th, 2018, 03:06:40 PM IST

కొద్దీ రోజుల క్రితం గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో యువత్రయం హార్థిక్ పటేల్, జిగ్నేష్ మరియు అల్పేష్ లు ప్రధాని మోడీకే ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు యువనాయకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. జిగ్నేష్ గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎమ్మెల్యే గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. జిగ్నేష్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాడు దళిత నేత మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.

హైదరాబాద్ పోలీస్ లు మంద కృష్ణ మాదిగని నిర్బందించి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ని కలసిన జిగ్నేష్ సంఘీభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ ల రాజ్యాన్ని నడిపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని ఆరోపించారు. నాయకుడిని నిర్బంధిస్తే ఉద్యమం మరింతగా ఎగసి పడుతుందని హెచ్చరించారు.తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలని పిలునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఐదెకరాల భూమిని కేటాయించాలని అన్నారు.