మళ్ళీ టీమిండియా కెప్టెన్ గా ధోని..!

Tuesday, September 25th, 2018, 03:00:18 PM IST

భారత జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని మళ్ళీ జట్టుకి నాయకత్వ భాద్యతలు చేపట్టాడు.ఇప్పటికే భారత జట్టులో అనఫీషియల్ గా ధోనీ సలహా సూచనలే పాటిస్తుంటారు మన యంగ్ కెప్టెన్లు.ఈ కెప్టెన్ కూల్ అందరిలా కాకుండానే చాలా సాధారణంగా తన కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు, మళ్ళీ ఇన్నాళ్లకు టాస్ ఎగరేసేందుకు తన నాయకత్వ భాద్యతలు చూపేందుకు ఈ రోజు జరగనున్న ఆఫ్గనిస్తాన్ మ్యాచుకు సంసిద్ధం అయ్యాడు.

అదేంటి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు కదా?అనుకుంటున్నారా గడిచిన మూడు మ్యాచుల్లోనూ మన హిట్ మ్యాన్ ఎడతెరిపి లేకుండా బౌలర్ల అంతు చూసి విజృంభించాడు.దీనితో క్రికెట్ బోర్డు వారు రోహిత్ శర్మకు విశ్రాంతిని అందించారు.ఇక మరి జట్టు సారధిగా ఎవరుంటారు అంటే అందరి కళ్ళు ధోని మీదే పడ్డాయి,దీనితో మళ్ళీ సరిగ్గా 696 రోజులు తర్వాత కెప్టెన్ గా 200వ వన్డే మ్యాచుకు మళ్ళీ కెప్టెన్ గా మారాడు.