ధోనీ చివరి సిక్స్ తో ఎన్నిసార్లు మ్యాచ్ ముగించాడో తెలుసా..?

Saturday, April 28th, 2018, 12:06:57 AM IST

అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్‌ను అత్యుత్తమంగా ముగించడంలో గొప్ప రికార్డు కలిగిన క్రికెటర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అని చెప్పుకోక తప్పదు. భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లో ధోనీ నాయకత్వంలోనే వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు అభిమానుల గుండెల్లో చిర స్థాయిలో నిలిచిపోతుంది అంటే నమ్మక తప్పదు.

ఇప్పటి వరకు కెప్టెన్ కూల్ ధోనీ ఎన్నిసార్లు సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. మహీ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్య ఛేదనలో 21సార్లు సిక్స్ బాది విజయవంతంగా మ్యాచ్‌ను ఫినిష్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఏ ఫార్మాట్లో ఎన్నెన్నిసార్లని లెక్కేసి కొడితే…

1. అంతర్జాతీయ వన్డేలు- 9సార్లు
2. ఐపీఎల్- 4సార్లు
3. అంతర్జాతీయ టీ20లు- 3సార్లు
4.ఛాంపియన్స్ లీగ్ టీ20 -2సార్లు
5. దేశవాళీ లిస్ట్-ఏ మ్యాచ్‌లు- 2సార్లు
6. టెస్టు క్రికెట్- ఒక్కసారి… ఇంకా మునుముందర మరెన్నో వేచి చూడాలి.