కోహ్లీ సేన ఓటమిపై ధోని రెస్పాన్స్..!

Friday, January 19th, 2018, 09:54:40 PM IST

సౌత్ ఆఫ్రికా టూర్ లో ఉన్న టీం ఇండియా టెస్టు సిరీస్ ఓటమిపై మాజీ కెప్టెన్ ధోని రెస్పాండ్ అయ్యాడు. కోహ్లీ సేన ఎందుకు ఓటమి చెందిందో తాను సరైన సమాధానం చెప్పలేనని తెలిపాడు. కానీ టెస్టు సిరీస్ విజయం సాధించాలంటే మాత్రం కొన్ని విషయాలపై మాట్లాడతాని అన్నాడు. టెస్టులో విజయం సాధించాలంటే మొదట ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టగలాగాలి.ఇండియా ఆ విషయంలో విజయవంతం అయింది.

స్వదేశంలో ఆడుతున్నా, విదేశాల్లో ఆడుతున్నా 20 వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఇక రెండవ పని వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించగలగడం అని ధోని తెలిపాడు. ఒకసారి పరుగులు చేయడం ప్రారంభం అయ్యాక ప్రత్యర్థిపై పై చేయి సాధించినట్లే అని ధోని తెలిపాడు. ఈ ఏడాది జరగబోయో ఐపీఎల్ గురించి కూడా ధోని ప్రస్తావించాడు. ఈ ఏడాది చెన్నై జట్టు తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అశ్విన్ ని వేలం ద్వారా ప్రయత్నిస్తామని ధోని తెలిపాడు.