అసెంబ్లీ స‌మావేశాల్లోపు కాపులు బీసీల్లో?

Saturday, September 8th, 2018, 10:00:30 PM IST

కాపునేత ముద్ర‌గ‌డ‌ ఎంత అరిచి గీ పెట్టినా! ఉద్య‌మాలు చేసినా.. అనుకున్న‌ది మాత్రం సాధించ‌లేక‌పోతున్నారు. చంద్ర‌బాబు అధికార ద‌ర్పం ముందు ముద్ర‌గ‌డ బీరాలు ఏవీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. రాజ్యాధికారం చేతిలో ఉంటే ఎవ‌రినైనా అణ‌చివేయొచ్చ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిరూపించింది. ద‌శాబ్ధాలుగా కాపుల్లో క‌రుడుగ‌ట్టుకుపోయిన `బీసీల్లో చేరిక‌ నినాదం` చివ‌రికి మ‌ట్టికొట్టుకుపోయేట్టే క‌నిపిస్తోంది కానీ, బాబు ఏమాత్రం అందుకు దారి చూపించేట్టు క‌నిపించ‌లేదు. పైగా ప్ర‌తిసారీ త‌న‌ని ముప్పు తిప్ప‌లు పెట్టాల‌ని చూస్తున్న ముద్ర‌గ‌డ‌ను, ఆయన అనుచ‌రుల్ని తొక్కిప‌ట్టి ఉంచేందుకు పోలీసుల్ని, అధికారుల్ని చంద్ర‌బాబు ప్ర‌యోగిస్తున్న‌ సంగ‌తి అంద‌రికీ తెలుసు.

అందుకే సాధార‌ణ ఎన్నిక‌ల ఘంటారావం మోగుతున్న వేళ‌.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌రోసారి కాపుల రిజ‌ర్వేష‌న్ అంశాన్ని పెద్ద స్థాయిలో గుర్తు చేసే ప‌ని పెట్టుకున్నారు ముద్ర‌గ‌డ‌. నేడు రాజోలులో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న కాపు రిజ‌ర్వేష‌న్ల ప్ర‌స్థావ‌న‌ను హైలైట్ చేశారు. “ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అమలుచేసి చరిత్ర పురుషుడు కావాలని… హామీలను అమలు చేస్తే పది లక్షల మంది కాపులతో ఘన సన్మానం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామ“ని ముద్రగడ ఢంకా భ‌జాయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపు లోపు కాపు రిజర్వేషన్ ను సవరణలతో అమలులోకి తీసుకురావాలి. కాపులకు రిజర్వేషన్ కొరకు ఉద్యమం చేపట్టి 3 సంవత్సరాలు పూర్తవుతోంది.. అని తెలిపారు. చంద్రబాబు అధికారం కోసం, కుర్చీకోసం పాదయాత్రలోనూ, ఎన్నికల సభలలోనూ కాపులకోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరూతూ రోడ్డుమీదకు వ‌చ్చామ‌ని ముద్ర‌గ‌డ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అయితే ముద్ర‌గ‌డ ఎంత ప్ర‌య‌త్నించినా బాబులో ఇసుమంత ఛేంజ్ కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌పోతే కాపు కార్పొరేష‌న్ నిధులు పేరుతో అంతా మాయమాట‌లు చెప్పి మ‌భ్య పెట్టేందుకు ప్ర‌య‌త్నించిన సంగ‌తిని కాపు నిరుద్యోగ యువ‌త గుర్తించింది. బాబు గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ ట‌క్కుట‌మార విద్య‌ల్ని ప‌క్కాగా విశ్లేషిస్తోంది నిరుద్యోగ యువ‌త‌. ఈ ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదని తేదేపాకు స్ప‌ష్టంగా కాపులు వార్నింగ్ ఇస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments