రాష్ట్రం విడిచి వెళ్లిపోతానంటున్న‌ ముద్ర‌గ‌డ‌

Monday, September 26th, 2016, 08:00:07 PM IST

mudragada
ఒక ప‌క్క ప్ర‌తి ప‌క్షాల దాడికి.. మ‌రొవైపు కాపు ఉద్య‌మం దెబ్బ‌కు అధికార టీడీపీకి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. సీఎం సింహాస‌నంలో ఉన్న‌ చంద్ర‌బాబు కు సైతం లోలోప‌ల గుబులు మొద‌లైంది. తాజాగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రో స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబు నావి దొంగ ధీక్ష‌ల‌ని అంటున్నారు. అలా అయితే ధీక్ష స‌మ‌యంలో నా ఇంటి బ‌య‌ట‌, ఆసుప‌త్రి లో పోలీసులు ఎందుకు కాపాలా కాసిన‌ట్లు? అందుకు మీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? అని ప్ర‌శ్నించారు.

నేను కాపు బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసిన స్థానంలో మీరు మీ కుల‌స్థుల‌తో స‌భ‌ను ఏర్పాటు చేయండి. మీ స‌భ‌కు భారీ ఎత్తున జ‌నం త‌ర‌లివచ్చినా? మీ సమావేశం స‌క్సెస్ అయినా నేను నా సొంత రాష్ట్రం వ‌దిలి వెళ్లిపోతాన‌ని స‌వాల్ విసిరారు. ఆ పై నా ఆస్తుల‌ను మీరే అనుభ‌వించే విధంగా వీలునామా రాస్తాన‌ని ఉద్ఘాటించారు. తునిలో జ‌రిగిన స‌భ‌కు క‌నీసం నా త‌రుపు నుంచి వాట‌ర్ ప్యాకెట్ కూడా స‌ప్లై చేయ‌లేక‌పోయాను. తినే తిండి..త్రాగే నీరు అన్నీ నా కులస్థ‌లు సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసుకుని వచ్చారు. మా ఉద్య‌మంలో నీతి..న్యాయం..బాధ‌..ఆక్రోశం ఉన్నాయ‌ని ఉద్ఘాటించారు.