ముద్రగడను ఇంట్లోనే నిర్బంధించిన పోలీసులు

Tuesday, January 24th, 2017, 05:45:11 PM IST

mudhra-gadda
కాపు రేజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన బుధవారం కాపు రేజర్వేషన్ల కోసం సత్యాగ్రహ యాత్ర తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు అనుమతిని నిరాకరించిన పోలీసులు ముద్రగడ పద్మనాభాన్ని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో ముద్రగడ స్వంత గ్రామం అయిన కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అనుమతి లేనిదే అలాంటి యాత్రలు చేపట్టకూడదని అంటున్నారు.

బుధవారం నుండి సత్యాగ్రహ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ఒకరోజు ముందే ఆయన ఇంటివద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి నుండి బయటకు రాగానే పోలీసులు కారును అడ్డుకుని ఆయనను వెనక్కి పంపేసి, ఇంట్లోనే ముద్రగడ పద్మనాభాన్ని నిర్బంధించారు. దాంతో ముద్రగడ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు మాత్రం ముద్రగడ యాత్రను అనుమతించేదిలేదని ఖరాకండిగా చెప్తున్నారు.