కాపుల‌కోసం ముద్ర‌గ‌డ పాదయాత్ర‌!

Tuesday, September 20th, 2016, 04:43:07 PM IST

mudragada-padmanadam
కాపుల‌ను బీసీల్లో చేర్చే వ‌ర‌కూ త‌న పోరాటం ఆగ‌ద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రాజ‌మండ్రిలో కాపు నేతలంతా స‌మావేశ‌మై కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే అవి ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా లీక్ కాలేదు. ఈసారి బాబు కు ఇవ్వ‌బోయే ఝ‌ల‌క్ కు ప్ర‌భుత్వం దిగివ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం లో ఉంది. తాజాగా దానికి సంబంధించిన కొన్ని అప్ డేల్స్ వెలుగులోకి వ‌చ్చాయి.

న‌వంబ‌ర్ నుంచి ముద్ర‌గ‌డ ఏపీ జిల్లాలో పాద‌యాత్ర చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ లోగా నియోజ‌క వ‌ర్గాల స్థాయిలో కాపు క‌మిటీల‌న్నింటిని పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. కాపులంతా క‌లిసి రొడ్డెక్కి నిర‌స‌న‌లు చేస్తే ఎలా ఉంటుంద‌నేది బాబు కు అప్పుడు తెలుస్తుంద‌ని కాపు నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. అలాగే కాపు ఉద్య‌మాన్ని అణ‌గ‌దొక్కాల‌ని చూస్తున్న అధికార పార్టీకి..బీసీ వ‌ర్గాల వారికి త‌గిన విధంగా స‌మాధానం చెప్పాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

ఈ పాదయాత్ర ద్వారా అధికారంలో ఉన్న టీడీపీ కాపు నాయ‌కులు కూడా జ‌త క‌లిసే .అవ‌కాశం ఉంద‌ని కాపు నాయ‌కులు భావిస్తున్నారట. పాద‌యాత్ర అనేది తెలుగు రాష్ట్రాల్లో ఓ హిట్ పార్ములా లాంటింది. ఒక అడుగు వెనుక కోట్లాది మంది అడుగులు ప‌డితే ఆ ఉప్పెన ఎలా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు.