లేటెస్ట్ : మరో సారి నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ!

Wednesday, March 7th, 2018, 12:27:21 PM IST

మొన్నటికి మొన్న ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ సంపన్నుల జాబితా ప్రకటించారు. అందులో బిల్ అండ్ మిలేన్ద గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ని దాటి అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ 112 బిలియన్ డాలర్ల సంపాదనతో మొదటి స్థానాన్ని కైవశయం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే ఫోర్బ్స్ సంస్థ తాజాగా భారత కుబేరుల జాబితాని కూడా ప్రకటించింది. భారత దేశంలోని మొత్తం 121 మంది కుబేరులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈ ఏడాది 16.9 బిలియన్ డాలర్ల సంపాదనతో నెంబర్ వన్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు.

మొత్తంగా ఆయన ఆస్తి ప్రస్తుతం 40.1 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఇటీవల ప్రకటించిన ప్రపంచ సంపన్నుల జాబితాలో తన మొత్తం ఆస్తితో ప్రపంచ 2,208 బిలియనీర్లలో 19వ స్థానానన్ని కైవశం చేసుకున్నారు. అయితే ఆయన గత సంవత్సరం 2017 ప్రకటించిన కుబేరుల్లో 33వ స్థానం లో వున్నారు. అయితే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం లక్ష్మి మిట్టల్ ను దాటుకుని, విప్రో సంస్థల చైర్మన్ అజీమ్ ప్రేమ్జి మొత్తంగా 18.8 బిలియన్ డాలర్లతో రెండవ స్థానం పొందారు. ఆయన 14. 9 బిలియన్ డాలర్లతో 2017 లో ప్రపంచ జాబితాలో 72వ ర్యాన్కు పొందారు. కాగా ఆయన ప్రస్తుతం 58వ స్థానికి ఎగబ్రాకారు.

ఆ తరువాతి మూఢవ స్థానం లో లక్ష్మి మిట్టల్ 16.4 బిలియన్ డాలర్లతో 2017 లో 58వ ర్యాన్కు పొందిన మిట్టల్ ఈ సంవత్సరం తో కలిపి మొత్తం సంపాదనతో 18.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల్లో 62వ స్థానానికి పడిపోయారు. అయితే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం జిందాల్ స్టీల్ అధినేత సావిత్రి జిందాల్ 8.8 బిలియన్ డాలర్ల ఆర్జనతో ప్రపంచ సంపన్నుల్లో 176వ ర్యాంకు పొంది, భారత దేశం లోనే ధనిక మహిళగా నిలిచారు.

ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన భారతీయ సంపన్నుల జాబితా ఇలా వుంది:

ముకేశ్ అంబానీ (40.1 బిలియన్ డాలర్లు )
అజిమ్ ప్రేమ్జి (18.8 బిలియన్ దార్లర్లు)
లక్ష్మి మిట్టల్ ( 18. 5 బిలియన్ డాలర్లు)
శివ నాడార్ ( 14. 6 బిలియన్ డాలర్లు)
దిలీప్ సంగ్వి ( 12.8 బిలియన్ డాలర్లు )
కుమార్ బిర్లా (11.8 బిలియన్ డాలర్లు )
ఉదయ్ కోటక్ ( 10.7 బిలియన్ డాలర్లు )
రాధాకిషన్ దమాని (10 బిలియన్ డాలర్లు )
గౌతమ్ అదాని ( 9.7 బిలియన్ డాలర్లు )
సైరస్ పూనవల్ల ( 9.1 బిలియన్ డాలర్లు )