యూపీ రాజకీయాల్లో ముసలం..ముఖ్యమంత్రిని పార్టీ నుంచి వెలివేసిన ములాయం !

Friday, December 30th, 2016, 08:12:46 PM IST

muyam
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇది సంచలన ఘటన అని చెప్పొచ్చు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ములాయం సింగ్.. తనకుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ ని ఆరేళ్ల పాటు వెలివేశారు. ఈ ఘటన యూపీ రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పొచ్చు. త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా జరగడం సమాజ్ వాదీ పార్టీ కి ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అఖిలేష్ తోపాటు తనసోదరుడు రామ్ గోపాల్ యాదవ్ ని కూడా ములాయం సింగ్ బహిష్కరించడం కొసమెరుపు. వాళ్లిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, సమాజ్ వాడి పార్టీ ప్రతిష్ట దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవడం తన భాద్యత అని ములాయం అన్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థులను ములాయం ప్రకటించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అఖిలేష్ తన సొతం గా 235 మంది సభ్యుల జాబితాని విడుదల చేసాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ములాయం తనకొడుకు కి పార్టీ తరపు నుంచి షోకాజ్ నోటీసు పంపాడు. అదేవిధంగా మీడియా ముఖంగా పార్టీ పరువు తీసేలా మాట్లాడుతున్న తన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పై కూడా ములాయం ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా శుక్రవారం సాయంత్రం వీరిద్దరిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ములాయం ప్రకటించి సంచలనం రేపారు. కాగా మరోవైపు రామ్ గోపాల్ యాదవ్ తండ్రి కొడుకుల సమస్యలను మరింత పెంచే వ్యాఖ్యలు చేసారు. అఖిలేష్ ప్రకటించే జాబితా ప్రకారమే తాము ఎన్నికల్లో పోటీకి వెళతామని ఆయన ప్రకటించారు.దీనికోసం రానున్న రెండుమూడు రోజుల్లో పార్టీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ ఈ సంక్షోభం తో ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments