ముంబై కు మళ్లీ అదే దరిద్రం.. బ్యాడ్ లక్!

Saturday, April 14th, 2018, 08:55:06 PM IST

ముంబై ఇండియన్స్ టీమ్ దరిద్రం ఏమిటో గాని గెలుపు దోబూచులాడుతోంది. ఎంత కష్టపడినా కూడా చివరి నిమిషంలో బ్యాడ్ లక్ రోహిత్ సేనను కలవరపెడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై ప్రతి మ్యాచ్ లో చివరి ఓవర్లనే ఓటమి చూడాల్సి వచ్చింది. చెన్నై – హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లు ఎంత ఉత్కంఠను రేపాయో తెలిసిందే. ఇక ఈ రోజు ఢిల్లీతో ఆడిన మ్యాచ్ లో కూడా ముంబై బౌలింగ్ ద్వారా ఓటమి చెందింది.


మొదట బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన నిర్ణిత ఓవర్లలో 194 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (53) లూయిస్‌ (48) రాణించడంతో ఆరంభం అదిరిపోయింది. ఇక ఆ తరువాత ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 43 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా జట్టును నడిపించాడు. అయితే చివరి ఓవర్లలో పాండ్య బ్రదర్స్ – పోలార్డ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో 195 లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది.