ముంబైకు హైదరాబాద్ దెబ్బ పడుతుందా?

Wednesday, April 11th, 2018, 06:20:36 PM IST

 

ఐపీఎల్ లో నిన్న కోల్ కత్తా – చెన్నై ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా జరిగిందో అందరికి తెలిసిందే. ఐపీఎల్ లో మొదటి సారి 200 స్కోర్స్ ను రెండు జట్లు చేయడం చాలా ఆసక్తిని రేపింది. ఇకపోతే సన్ రైజర్స్ మరో ఆటకు సిద్ధమైంది. గురువారం హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. అసలే చెన్నై చేతిలో ఓడిపోయి ఉన్న ముంబై ఎలాగైనా మొదటి గెలుపును గెలుచుకోవాలని మంచి కసి మీద ఉంది. ఇక సన్ రైజర్స్ రెండవ గేమ్ లో కూడా గెలవాలని ప్లాన్స్ వేస్తోంది.

ముంబై ఇండియన్స్: ఐపీఎల్ 2018 మొదటి మ్యాచ్ ఆడిన ముంబై చెన్నై చేతిలో ఊహించని విధంగా ఓటమిపాలైంది. అందులో జరిగిన మిస్టేక్స్ ఇక్కడ జరగకుండా కెప్టెన్ రోహిత్ ప్లాన్స్ వేస్తున్నాడు. బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న ముంబై బౌలింగ్ లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ముస్తాఫిజుర్‌ రహ్మన్‌ మొన్నటి మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. వికెట్లు బాగానే తీస్తున్నప్పటికీ ముంబై బౌలర్లు పరుగులు మాత్రం ధారాలంగా ఇచ్చేస్తున్నారు. రోహిత్ ఇంకా బ్యాటింగ్ బాగా ఆడాలి. మరి బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఉన్న సన్ రైజర్స్ ను ముంబై బ్యాట్స్ మేన్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

సన్ రైజర్స్: గెలుపుతో 2018 ఐపీఎల్ ను మొదలు పెట్టిన జట్టులో ఉత్సాహం గట్టిగానే ఉంది. బ్యాటింగ్ లైనప్ – బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు అనే విధంగా విలియంసన్ సేన ఆలోచిస్తోంది. ఓపెనర్ ధావన్ మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. యూసుఫ్ పఠాన్ – మనీష్ పాండే లాంటి బలమైన ఆటగాళ్లు ఫేమ్ లో ఉండడం ప్లస్ పాయింట్. బౌలింగ్ లో కూడా జట్టు బలంగానే ఉంది. రషీద్ ఖాన్ భువనేశ్వర్ లైనప్ ప్రత్యర్థి జట్టును దెబ్బ తీయగలదు. మరి ముంబైను హైదరాబాద్ ఎంతవరకు దెబ్బ కొడుతుందో చూడాలి.